తాజావార్తలు

Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు

Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు


యోగా ఏ మతానికీ సంబంధించింది కాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్దురు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా యోగా గురించి కీలక ఉపన్యాసం ఇచ్చారు. యోగా డే సందర్భంగా ఇషా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. తమిళనాడులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, బెంగళూరులోని సద్గురు సన్నిధిలో NCC క్యాడెట్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, ప్రభుత్వ శాఖలు, రక్షణ దళాలు, సామాజిక వేదికలకు చెందిన సుమారు 50 వేల మందిని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి ఉచిత యోగా, ధ్యాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ.. యోగా అనేది తత్వశాస్త్రం కాదు, మతం కాదు. ఇది మనిషి శరీరం, మనస్సు, భావోద్వేగాలు, మేధస్సు, శక్తి వంటి అన్ని కోణాల్లో అత్యుత్తమ స్థితిని సాధించేందుకు ఉపయోగపడే శాస్త్రీయ ప్రక్రియ. వ్యక్తి ఏ మతానికి, జాతికి, కులానికి లేదా లింగానికి చెందిన వారైనా యోగా అందరికీ సమానంగా ఉపయోగపడుతుంది అని తెలిపారు.

మానవుల్లో సహజంగా దాగి ఉన్న మేధస్సు, సామర్థ్యాలను వెలికితీసే శక్తి యోగాకు ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతతో పాటు సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యోగాపై పెరుగుతున్న ఆదరణకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిదర్శనమని, వ్యక్తిగత శ్రేయస్సు నుంచి సామూహిక సంక్షేమం వరకు యోగా మార్గదర్శకంగా నిలుస్తోందని సద్గురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *