మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ బాడీ మేకోవర్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, చరణ్ డెడికేషన్ చూసి తాను ఎంతో ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు.
