పోలిక ఎప్పుడూ ఇబ్బందే! ఇప్పుడు అదే పోలిక విజయ్, పవన్ మధ్య తీవ్ర చర్చను రగిలిస్తోంది. విజయ్ విక్టరీని చూపిస్తూ.. కొందరు పవన్ స్థాయిని.. స్థానాన్ని పోల్చడం తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తెలుగు నాట పరిస్థితులు వేరు.. రాజకీయాలు వేరు.. సమీకరణాలు వేరు.. పవన్ పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు. వీటన్నింటికి పరిగణలోకి తీసుకుని చూస్తే.. విజయ్ కంటే.. పవన్ విక్టరీనే గొప్పదని కొందరు రాజకీయ ప్రముఖులు.. విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో పవన్, విజయ్ మధ్య పోలిక సరికాదని చెబుతున్నారు. తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. మే7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్న విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్‌కు గవర్నర్ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్‌ను విజయ్ ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్ స్పష్టం చేశారు.మరో వైపు, విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు.. కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ కూడా చెప్పేసింది.ఇక మరోవైపు విజయ్‌తో పొత్తుకు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు. విజయ్‌తో పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిపై ఒత్తిడి పెంచారు. అయితే TVKతో పొత్తుకు పళనిస్వామి ఆసక్తి చూపించడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు
Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్
Jana Nayagan: జననాయగన్ సినిమా పేరు మారుతుందా ??
Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
