తాజావార్తలు

IPL 2026: అంపైర్ల ఆదేశాలను ధిక్కరించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..!

IPL 2026: అంపైర్ల ఆదేశాలను ధిక్కరించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..!


IPL 2026: అంపైర్ల ఆదేశాలను ధిక్కరించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్..!

Tim David Fine: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 20వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల ప్రవర్తనను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ, టిమ్ డేవిడ్ ఐపీఎల్ నియమావళిలోని సెక్షన్ 2.4ను ఉల్లంఘించినట్లు నిర్ధారించింది. అంపైర్ల సూచనలను పాటించకపోవడం, మైదానంలో అనవసర జాప్యం చేయడం వంటి కారణాల వల్ల అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. దీనితో పాటు అతడి ఖాతాలో ఒక నెగటివ్ పాయింట్‌ను కూడా చేర్చారు.

అసలేం జరిగింది?

బెంగళూరు ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపులో ఉన్నాడు. అయితే ఆ సమయంలో బంతి తడిగా ఉండటంతో పాటు ఆకారం దెబ్బతినడంతో అంపైర్లు దానిని మార్చాలని నిర్ణయించారు. కొత్త బంతుల బాక్స్ ను మైదానంలోకి తెచ్చినప్పుడు, డేవిడ్ అంపైర్ల అనుమతి లేకుండా ఒక బంతిని తీసుకుని దానితో ఆడుకోవడం మొదలుపెట్టాడు.

అంపైర్లు బంతిని తిరిగి ఇవ్వమని పదేపదే కోరినప్పటికీ, టిమ్ డేవిడ్ వారి మాటలను పట్టించుకోకుండా బంతిని గాలిలోకి విసురుతూ కాలక్షేపం చేశాడు. ఇది అంపైర్లకు అసహనం కలిగించింది. కేవలం 18వ ఓవర్‌లోనే కాకుండా, 20వ ఓవర్‌లో వికెట్ పడిన సమయంలో కూడా డేవిడ్ ఇదే తరహాలో ప్రవర్తించాడు.

నేరాన్ని అంగీకరించిన డేవిడ్..

మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ టిమ్ డేవిడ్‌ను విచారించగా, తను చేసిన తప్పును అతడు అంగీకరించాడు. అంపైర్ల ఆదేశాలను బేఖాతరు చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా చర్యలు తీసుకున్నారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా ఇటువంటి వివాదాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *