తాజావార్తలు

Cinema: 10 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు.. తెలుగులోనూ మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్

Cinema: 10 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు.. తెలుగులోనూ మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్


Cinema: 10 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్లు.. తెలుగులోనూ మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్

మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా అక్కడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు సులభంగా వందకోట్ల క్లబ్‌లో చేరిపోతున్నాయి. పైగా ఈ సినిమల్లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. వీఎఫ్ ఎక్స్ హంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఉండవు. కానీ కంటెంట్ తోనే ఈ సినిమాలుప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అలా మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిన్న సినిమాల్లో ‘వాళా’ ఒకటి. ‘బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బాయ్స్‌’ అనేది ఈ మూవీ క్యాప్షన్. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అర్థం వస్తుంది. 2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘వాళా 2’ వచ్చింది. ‘బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌’ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఏప్రిల్‌ 2న రిలీజైన ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా 2024లో వచ్చిన పృథ్వీ రాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్‌ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.

సవిన్‌ తెరకెక్కించిన వాళా 2 సినిమాలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్కూల్ లైఫ్, ఫ్రెండ్ షిప్ కాన్సెప్టుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడి యూత్‌కు తెగ నచ్చేసింది. కాగా ఈ సినిమా నిర్మాతల్లో సాహు గారపాటి కూడా ఒకరు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా సాహు గారపాటి నిర్మించినదే. ఇప్పుడు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘వాజా 2’ కూడా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మలయాళం బ్లాక్ బస్టర్ ను త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, అతి త్వరలోనే వాళా 2 సినిమాను తెలుగులోకి రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *