తాజావార్తలు

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్


అందుకే నాకు స్టార్‌డమ్ రాలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రాజశేఖర్

నటుడు రాజశేఖర్ తన సుదీర్ఘ సినీ ప్రయాణం, రాబోయే చిత్రం బైకర్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో మగాడు, అల్లరిప్రియుడు, గరుడవేగ, సింహరాశి, గోరింటాకు వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మగాడు 2 పేరుతో రాబోతున్న చిత్రం నిజానికి మగాడు సినిమాకు సీక్వెల్ కాదని, ఆ టైటిల్ తమకు ఇష్టపడి పెట్టుకున్నదే అని స్పష్టం చేశారు. అలాగే, అల్లరిప్రియుడు వంటి సీక్వెల్స్ చేయాలనుకోవడం లేదని, తన వయసుకు తగ్గ పాత్రలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు రాజశేఖర్. అయితే, తాను ప్రస్తుతం నటిస్తున్న యాక్సిడెంట్ సినిమాను తన కుమార్తె శివాని అల్లరిప్రియుడు పార్ట్ 2 లాంటి సరదా చిత్రంగా అభివర్ణించిందని పేర్కొన్నారు రాజశేఖర్. తాను నటించిన బైకర్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నాయని రాజశేఖర్ ప్రశంసించారు. నిర్మాణ సంస్థ ధైర్యం, రాజీ పడని నిర్మాణ విలువలు అభినందనీయమని కొనియాడారు రాజశేఖర్.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

యూవీ క్రియేషన్స్ అధినేతలు ఇచ్చిన నంబర్ వన్ రాయల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన రాజశేఖర్ బుల్లెట్ సునీల్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ప్రేక్షకులు సింహరాశి, గోరింటాకు వంటి చిత్రాలను గుర్తు చేసుకుంటూ తనను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని చెప్పారు. స్టార్‌డమ్ లభించకపోవడానికి గల కారణాలను విలేఖరి ప్రశ్నించగా, తాను ఎప్పుడూ స్టార్‌డమ్, హోదా కోసం సినిమాలు చేయలేదని రాజశేఖర్ వివరించారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

“నెక్స్ట్ సబ్జెక్టు ఏంటి? ఈ సబ్జెక్టు బాగుందే, మనం చేసి ఉంటే బాగుండేది” అన్న కోణంలోనే తన పాత్రలను ఎంచుకున్నానని తెలిపారు. బైకర్ తో పాటు తాను ప్రస్తుతం నటిస్తున్న అన్ని చిత్రాలలో సబ్జెక్టే హీరో అనే సిద్ధాంతాన్ని తాను అనుసరిస్తున్నానని వెల్లడించారు. ఈ విధానం వల్లనే తనకు ఎక్కువ విజయం వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తన భార్య జీవిత, కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో తమదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారని, వారి విజయం పట్ల తాను గర్వపడుతున్నానని రాజశేఖర్ పేర్కొన్నారు. బైకర్ చిత్రం నుండి మళ్లీ తన స్టార్‌డమ్ ప్రారంభంకావాలని ఆకాంక్షించారు. బైకర్ ఏప్రిల్ 3న విడుదలవుతుందని, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో చూడమని ఆయన ప్రేక్షకులను కోరారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *