తాజావార్తలు

Shukra Gochar: అనవసర ఖర్చులు, ప్రయాణాలు.. శుక్రుడితో ఈ రాశులు జాగ్రత్త!

Shukra Gochar: అనవసర ఖర్చులు, ప్రయాణాలు.. శుక్రుడితో ఈ రాశులు జాగ్రత్త!


Shukra Gochar: అనవసర ఖర్చులు, ప్రయాణాలు.. శుక్రుడితో ఈ రాశులు జాగ్రత్త!

ఈ నెల(మార్చి) 26 నుంచి ఏప్రిల్ 19 వరకు మేష రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారికి కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు. శుక్రుడు ఈ రాశులకు దుస్థానాల్లో, అంటే, 3, 6, 7, 8, 12 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గడం, దండగ ఖర్చులు పెరగడం, వ్యసనాలకు అలవాటుపడడం, అనవసర పరిచయాలు ఏర్పడడం, మిత్రులు తప్పుదోవ పట్టించడం, అనవసర ప్రయాణాలు వంటివి జరిగే అవకాశం ఉంటుంది. వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. విలాసాల మీదా, వ్యసనాల మీదా, మిత్రుల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఉచిత సహాయాలు, దానధర్మాలకు అవకాశం ఉంది. మొత్తం మీద చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. మీ మనసులోని రహస్యాలను బయటపెట్టి, ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి.
  2. కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్ర గ్రహం అష్టమ స్థానంలో సంచారం చేయ డం వల్ల కుటుంబ సంబంధమైన విభేదాలు, దాంపత్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగ స్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో మోసపోవడం గానీ, నష్టపోవడం గానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్యాలకు అవకాశం ఉంది.
  3. తుల: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ రాశిలో సంచారం చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. సాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేస్తారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులు తప్పుదోవ పట్టిస్తారు. అనవసర పరిచయాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మోసానికి గురయ్యే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారిని ఇతరులు ఒక పట్టాన నమ్మకపోవచ్చు. అధికారులకు వీరి మీద నమ్మకం సడలుతుంది. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. డబ్బిచ్చినా, తీసుకున్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు అవకాశం ఉంది.
  5. కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృథా ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్య మైన అవకాశాలు చేజారుతాయి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కాలయాపన జరగడమో, ప్రయత్నం విఫలం కావడమో జరుగుతుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కాకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *