తాజావార్తలు

IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?

IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?


India vs Zimbabwe Result, T20 World Cup 2026: మస్ట్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు.. అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.

చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 55 పరుగులు, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నలుగురు ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఇవి కూడా చదవండి

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *