సీనియర్ హీరోయిన్ జయప్రద, నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయనతో తన అనుభవాలు, ప్రస్తుత సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులపై ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణను “చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి మనిషి” అని ప్రశంసించిన జయప్రద, ఆయన కోప స్వభావం వెనుక ఉన్న నిజాయితీని వివరించారు. బాలకృష్ణకు కోపం ఎక్కువ అనే చర్చ గురించి అడగ్గా, జయప్రద ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూనే, దాని వెనుక ఉన్న సానుకూల కోణాన్ని ఆవిష్కరించారు. “నిజాయితీగా ఉన్నవాళ్లకే కోపం వస్తాది” అని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేస్తే లేదా ఏదైనా ఒకటి తప్పు జరిగితే, నిజాయితీపరులు దానిని సహించలేరని, అలాంటి సందర్భాలలో వారికి కోపం వస్తుందని జయప్రద అన్నారు. కోపం వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడతారో వారికి తెలియకపోయినా, ఆ తర్వాత “అయ్యో నేను ఎందుకు అన్నాను” అని పశ్చాత్తాప పడతారని ఆమె తెలిపారు. ఇది నిజాయితీగల వ్యక్తుల సాధారణ లక్షణం అని జయప్రద పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
తాను బాలకృష్ణతో కలిసి సినిమాలు చేసినప్పుడు, ఆయన కోపం తనకు ఎప్పుడూ ఎదురు కాలేదని జయప్రద గుర్తు చేసుకున్నారు. అందుకు గల కారణాన్ని వివరిస్తూ, తాను “చాలా డిసిప్లిన్డ్గా” ఉండేవారినని చెప్పారు. “నేను టైంకి వెళ్ళిపోతాను, టైంకి షూటింగ్ కి రెడీ అయిపోతాను. ఆయన వస్తున్నాడు అంటే నేనైతే అక్కడ ఉండాల్సిందే” అని తన వృత్తి నిబద్ధతను వెల్లడించారు. హీరో వస్తున్నాడంటే హీరోయిన్ సిద్ధంగా ఉండాలనే నియమాన్ని తాను కచ్చితంగా పాటించేదానినని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
అయితే, ప్రస్తుత సినీ పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వృత్తిపరమైన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పుడు కొరవడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు. “అదే ఇప్పుడు తలకిందులు అయిపోయింది” అని చెబుతూ, “హీరో వచ్చేసి గంటలు గంటలు హీరోయిన్ కోసం వెయిట్ చేయాలి” అని ప్రస్తుత దుస్థితిని వివరించారు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే సమయానికి వస్తారని, మిగిలినవారు రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా వస్తున్నామని, చాలా బిజీగా ఉన్నామని వంటి కారణాలు చెబుతారని జయప్రద అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
జయప్రద..
Jaya Prada News
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
