
మెక్సికో టీవీలో లైవ్ షో జరుగుతుండగా యాంకర్ ఓవరాక్షన్ చేశాడు. స్టూడియోలో తన దగ్గరగా తిరుగుతున్న డ్రోన్‌పై కోపంగా కాలితో తన్నాడు. డ్రోన్ వెళ్లి పక్కనే ఉన్న మహిళా మోడల్ ముఖానికి బలంగా తగిలింది. దీంతో ఆమె నొప్పితో విలవిల్లాడింది. వీడియో చూసిన నెటిజన్లు యాంకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
కోపంతో డ్రోన్‌ను తన్నిన యాంకర్
మెక్సికోలోని కెనాల్ 6 ఛానెల్లో ప్రసారమైన ‘ఎస్ షో’ (Es Show) అనే వినోద కార్యక్రమంలో అక్టోబర్ 26న ఈ ఘటన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎర్నెస్టో చవానా అనే యాంకర్ తన చుట్టూ తిరుగుతున్న చిన్న డ్రోన్ ను చూసి అసహనానికి గురై కాలితో తన్నాడు. ఊహించని విధంగా ఆ డ్రోన్ పైకి ఎగిరి పక్కనే ఉన్న కొలంబియా మోడల్, డ్యాన్సర్ ఇసబెల్లా రోజస్ ముఖానికి బలంగా తగిలింది. డ్రోన్ ముఖానికి తగలడంతో ఇసబెల్లా రోజస్ నొప్పితో విలవిల్లాడింది. ఈ హఠాత్పరిణామంతో స్టూడియోలో గందరగోళం ఏర్పడింది. ఇతర మోడల్స్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి సహాయం చేశారు. ఆమెను స్టూడియో నుంచి పక్కకు తీసుకెళ్లి వైద్య సహాయం అందించారు. తిరిగి స్టూడియోలోకి వచ్చిన మోడల్ డ్రోన్ తగిలి పెదవిపై గాయం కావడాన్ని ఆమె టీవీ ప్రేకకులకు చూపించింది.
Esto acaba de pasar en un programa de México.
https://t.co/2Xa0NsZ3eM
— Decko. (@Frankzm) October 27, 2026
యాంకర్‌పై నెటిజన్లు ఆగ్రహం
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు యాంకర్ తీరుపై మండిపడుతున్నారు. మహిళకు డ్రోన్ తగిలిందని తెలిసినా వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పకుండా డ్రోన్‌ను అక్కడి నుంచి తొలగించాలంటూ యాంకర్ కేకలు వేయడం పై విమర్శించారు. యాంకర్ ప్రవర్తనలో వృత్తి పట్ల బాధ్యత కనిపించలేదని, బాధిత మోడల్‌కు న్యాయం జరగాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలకు యాంకర్ ఎర్నెస్టో చవానా స్పందించి క్షమాపణలు చెప్పారు. జరిగిన ఘటనకు బాధ్యత తనదేనని అంగీకరించారు. క్షణికావేశం కారణంగా లైవ్ టీవీ షోలో మహిళా మోడల్ గాయపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

https://t.co/2Xa0NsZ3eM