GSLV-F18 Successfully: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఒక భారీ రాకెట్‌ను ప్రయోగించి విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్, 2026 అక్టోబర్ 30వ తేదీన రాత్రి 11:51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఎన్వీఎస్-03 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ఈ ఉపగ్రహం భారతదేశపు నావిక్ (NavIC) వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. జీఎస్ఎల్వీ (GSLV) రాకెట్ తన 20వ ప్రయోగం. ఈ రాకెట్ ఎన్వీఎస్-03 (NVS-03) ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ప్రవేశపెట్టిన ఇస్రో.. మూడు దశల్లో ప్రవేశపెట్టి సక్సెస్ చేసింది. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. NVS-03 2232 బరువుగల శాటిలైట్ ను నింగిలోకి మోసుకెళ్లింది. భారత్ సొంతంగా తయారు చేసుకున్న నావిగేషన్ వ్యవస్థను బలోపేతానికి NVS-03ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం13 ఏళ్ల పాటు కక్షలో పని చేయనుంది.
NVS-03 అనేది రెండవ తరం నావిక్ ఉపగ్రహాలలో మూడవది. దీనికి స్వదేశీంగా తయారు చేసిన అటామిక్ క్లాక్, కొనుగోలు చేసిన అటామిక్ క్లాక్‌ను అమర్చారు. మునుపటి ఉపగ్రహాలలో L5 , S సిగ్నల్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా L1 సిగ్నల్‌ను జోడించారు. ఇది నావిగేషన్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం భారతదేశ భూభాగం, దాని చుట్టూ 1,500 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతానికి కచ్చితమైన ప్రదేశం, వేగం, సమయ సమాచారాన్ని అందిస్తుంది.
నావిక్ (NavIC) అనేది భారతదేశపు సొంత నావిగేషన్ వ్యవస్థ. ఇది రెండు రకాల సేవలను అందిస్తుంది. ఒకటి సాధారణ ప్రజల కోసం ఉద్దేశించిన ‘స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్’, మరొకటి ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ‘రెస్ట్రిక్టెడ్ సర్వీస్’.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఉపగ్రహాలు వెళ్లాయి:
ఇస్రో మొత్తం ఐదు సెకండ్ జనరేషన్ ఉపగ్రహాలను నిర్మించాలని యోచిస్తోంది. ఇస్రో 2023 మే 29న జీఎస్ఎల్వి-ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్విఎస్-01ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇది మొట్టమొదటి స్వదేశీ అణు గడియారాన్ని మోసుకెళ్లింది. ఇప్పుడు ఈ రోజు ప్రయోగించిన కొత్త ఉపగ్రహం ఎన్విఎస్-03, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ వ్యవస్థ వాహన నావిగేషన్, లొకేషన్ సేవలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఇది ఒకప్పుడు ఇతర దేశాల వ్యవస్థలపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అందువల్ల ఈ రాత్రి జరిగే ఇస్రో ఉపగ్రహ ప్రయోగం దేశానికి చాలా కీలకం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
