Success Formulas – 01.
బలీయమైన కోరికని పెంపొందించుకోవడం

విజయానికి కావాల్సిన మొదటి మెట్టు
విజయానికి కావాల్సిన మొదటి మెట్టు బలీయమైన కోరికని పెంపొందించుకోవడం. ‘నేను ఇంజనీర్ని కావాలి’, ‘నేను డాక్టర్ని కావాలి’, ‘నేను ఈ దేశపు క్రికెట్ టీమ్లోలో నేను ఒకడిని అవ్వాలి’, ‘నేను ఎప్పటికయినా గొప్ప దర్శకుడిని కావాలి’ లాంటి బలీయమైన కోరిక మీ హృదయాంతరాళల్లో నిరంతరం అగ్నిలా మండుతుండాలి.
అసలు కోరికే లేనప్పుడు విజయం ఎక్కడనుండి వస్తుంది?
https://youtube.com/shorts/PVvTli348UU?si=gNtGn1fItCBHL1LB
అసలు కోరికే లేనప్పుడు…
మామూలు కోరిక వేరు, బలీయమైన కోరిక వేరు. బలీయమైన కోరిక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తుంది. మీ మెదడు దేనిని బలంగా కోరుకుంటుందో, దానినే అది సాధిస్తుంది.
హెన్రీఫోర్డ్’ బలీయమైన కోరికతో అమెరికా స్వరూపాన్నే మార్చాడు. అతడు దేశ ప్రజలందరిని ‘కదిలే గది’కి నిదర్శనమైన కారులో కూర్చుండబెట్టి తన బలీయమైన కోరికని నిజం చేసుకున్నాడు. https://youtube.com/shorts/ZFrjvqu67Fc?si=LGrkmYXpB1cntkNR
థామస్ అల్వా ఎడిసన్ బలీయమైన కోరికతో మానవాళికి విద్యుచ్ఛక్తి రూపంలో వెలుగుని ప్రసాదించాడు. ఈనాడు చకచకా కదుల్తున్న ఫ్యాక్టరీ మెషిన్లు, సినిమాహాల్లు, వీధిలైట్లు ఒకనాటి అతడి చలువే.
ఆ వ్యక్తి ఎలాగైనా రచయిత కావాలనుకున్నాడు. తానెప్పటికైనా గొప్ప రచయితని అవుతానని అతడు బలీయమైన కోరికని పెంచుకున్నాడు.
ఫలితంగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి రాయడం మొదలుపెట్టాడు. అతడికి పేరు రావడానికి తొమ్మిది సం॥రాలు పట్టింది. ఆ తొమ్మిది సం॥రాలలో అతడి ఆదాయం కేవలం ముప్ఫై డాలర్లు (అంటే రూ. 750/- మాత్రమే).
తుదకు వ్యాసాలు, నాటకాలు, పుస్తకాలు రాసి ప్రపంచంలోనే గొప్ప రచయితగా ప్రఖ్యాతి గాంచిన ఆ వ్యక్తి పేరు జార్జి బెర్నాండ్!
బలీయమైన కోరిక వల్ల తొమ్మిది సం॥ తరువాత కొన్ని కోట్లు గడించాడు. ఓ మామూలు హోటల్ క్లర్కు అయిన ఒబేరాయ్ బలీయమైన కోరికతో ప్రపంచంలోని అనేక చైన్లు గల ఒబేరాయ్ హోటళ్ళ సముదాయానికి ఛైర్మన్ అయ్యాడు.https://youtube.com/shorts/Ii7ZP5xZZ_Q?si=F3KtND1yutxGmz88
ఒక్కసారిగా మీలో బలీయమైన కోరిక కదలాడితే, మీరు ఎవరెస్ట్ పర్వతాన్ని సైతం అవలీలగా అధిరోహించగలరు.
ఆ బలీయమైన కోరికే నిప్ఫై మీలో రగిలి ఓ నిర్దిష్ట గమ్యాన్ని రూపొందించి దానిని సాధించే దిశగా చెలరేగి పోతుంది.
కాబట్టి లక్ష్యం సాధించాలంటే ముందుగా బలీయమైన కోరికని పెంపొందించుకోవాలి.https://youtube.com/shorts/lskEY7ACV2w?si=iaXKhz9xDKcrvn9r
విజయం ఎక్కడనుండి వస్తుంది?
ప్రతి విజయం ఒక బలీయమైన కోరికతో మొదలవుతుందని మర్చిపోకండి. “ఒకానొకప్పుడు ఒక వూర్లో ఒకడు వుండేవాడు. అతడు ఏదో ఒక రోజు తను గొప్పవాడిని అవుతానని….” ఇలా సాగే ప్రతి కథ మీకు ప్రేరణ కావాలి. అప్పుడే మీకు విజయం సిద్దిస్తుంది సుమా!
బలీయమైన కోరికే సానియా మీర్జాని వింబుల్డన్ జూనియర్ విజేతని చేసింది

చిన్నప్పట్నుంచి టెన్నిస్ని ఆడుతున్న సానియా మీర్జాలోని బలీయమైన కోరిక ఆమెని వింబుల్డన్ జూనియర్ టైటిల్ గెలవడానికి పురికొల్పింది.
టెన్నిస్లోని మూడు సెట్లలో మొదటి సెట్టు ఆమె ఓడిపోయింది. దాంతో రెండూ, మూడు సెట్లలో ఎలాగైనా గెలవాలన్న బలీయమైన కోరిక ఆమెని పురికొల్పి చివరకు ప్రపంచ జూనియర్ విజేతని చేసింది.
సాధారణంగా మొదటి సెట్టు ఓడిపోగానే చాలామంది నీరుకారిపోతారు.
కాని ఆ మొదటి సెట్టు ఓటమే ఆమెలో బలీయమైన కోరికని రగిలించి తిరిగి జూలు విదిల్చిన సింహంలా తర్వాత రెండు సెట్లని గెలిచేలా చేసింది.https://youtube.com/shorts/4sVV3NHSAKc?si=JBuQdQhq84JtZN5d
చివరిగా …..
Part-02. Next Page Follow Me.
