తాజావార్తలు

ఫ్రెంచ్ ఓపెన్ 2026: రసవత్తరంగా పోరు.. ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు..


ఫ్రెంచ్ ఓపెన్ 2026: రసవత్తరంగా పోరు.. ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు..

ఫ్రెంచ్ ఓపెన్ 2026లో తెలుగుతేజం పీవీ సింధు సత్తా చాటింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన హినా అకేచీతో పీవీ సింధు తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో హినా అకేచీని ఓడించి పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ గంటా 13 నిమిషాల పాటు జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంక్ అయిన జపనీస్ క్రీడాకారిణిపై 21-10, 20-22, 21-16 తేడాతో పీపీ సింధు విజయం సాధించింది. జులైలో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలుచుకున్న వీవీ సింధు.. ఇప్పుడు ఈ గెలుపుతో BWF సూపర్ 750 ఫైనల్‌కు చేరుకుందని చెప్పవచ్చు.

ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఫైనల్‌లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి ఆన్ సే-యంగ్‌తో పీవీ సింధు తలపడనుంది. ఫైనల్‌లో నెంబర్ వన్ క్రీడాకారిణీతో తలపడాల్సి ఉండటంతో పీవీ సింధు కఠిన సవాల్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ఫైనల్‌లో అత్యత్తుమ ప్రదర్శన కనబరుస్తానని పీవీ సింధు తెలిపారు. ఆన్ సే-యంగ్‌ మంచి ఫామ్‌లో ఉందని, తాను ఆమెకు గట్టి పోటీ ఇవ్వాలని అన్నారు. మ్యాచ్‌లో ప్రతి పాయింట్ ముఖ్యమేనని, ఆమెతో చాలాసార్లు ఆడానని తెలిపారు. ఆమె చాలా బాగా ఆడుతోందని, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంటుందని తాను ఆశిస్తున్నానని పీపీ సింధు అన్నారు. తాను మైదానంలోకి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *