బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో ఆరోవారం కెప్టెన్సీ పోటీ రసవత్తరంగా మారింది. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ప్రత్యేక అవకాశాన్ని ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచే ఛాన్స్ కల్పించడంతో పాటు, తమ పాయింట్లను కాపాడుకుంటూ ఇతర టీమ్‌ల స్కోర్‌ను తగ్గించుకునేలా కొత్త టాస్క్‌ను ఇచ్చాడు. దీంతో హౌస్‌లోని పాత కంటెస్టెంట్లపై వైల్డ్ కార్డ్స్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో ఇప్పటికే ఉన్న ఓజీ కంటెస్టెంట్ల ఆటతీరును బయట నుంచి గమనించిన వైల్డ్ కార్డ్ సభ్యులకు బిగ్ బాస్ ఓ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ ప్రవర్తనకు సరిపోయే లక్షణాలను గుర్తించి వారికి తగిన ట్యాగులు ఇవ్వాలని సూచించాడు. ఈ అభిప్రాయాల ఆధారంగా ప్రత్యర్థి టీమ్ పాయింట్లను తగ్గించుకోవడంతో పాటు, తమ స్కోర్‌ను పెంచుకునే అవకాశం కల్పించాడు.
ఈ క్రమంలో శ్వేత నాయుడు.. రోహిత్‌కు డ్రామా కింగ్ అనే ట్యాగ్ ఇచ్చింది. త్రిగుణ్‌కు మానిప్యులేటర్, రామ్ ప్రసాద్‌కు కన్నింగ్, దేబ్జానీకి సేఫ్ ప్లేయర్, ఝాన్సీకి బ్యాక్ స్టాబర్, షాలినీకి విక్టిమ్ కార్డ్ అనే ట్యాగులను వైల్డ్ కార్డ్ టీమ్ ఎంపిక చేసింది. దీంతో ఈ టాస్క్‌లో ఎవరెవరు సరైన అంచనాలు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ట్యాగులు, ఓజీ కంటెస్టెంట్ల అంచనాలతో టాస్క్ ప్రారంభమైంది. మొదటి బజర్‌లో సుధీర్, వంశీ పోటీపడ్డారు. ఈ రౌండ్లో సుధీర్ ముందుగా రియాక్ట్ అయినప్పటికీ, అతను ఎంచుకున్న సమాధానం తప్పు కావడంతో పాయింట్ దక్కలేదు. మరోవైపు ఝాన్సీకి బ్యాక్ స్టాబర్ ట్యాగ్ ఇచ్చినట్లు శివ్ వెల్లడించాడు.
ఇక త్రిగుణ్‌కు ‘మానిప్యులేటర్’ అనే ట్యాగ్ ఇచ్చారని వంశీ కరెక్ట్‌గా గుర్తించి తన టీమ్‌కు పాయింట్ సాధించిపెట్టాడు. అలాగే షాలినీకి ‘విక్టిమ్ కార్డ్’ అనే ట్యాగ్ ఇచ్చిన విషయాన్ని రామ్ ప్రసాద్ కూడా సరిగ్గా అంచనా వేశాడు. ఇలా టాస్క్ సాగుతున్న కొద్దీ కంటెస్టెంట్ల మధ్య ఉన్న అభిప్రాయాలు బయటపడటంతో హౌస్‌లో ఆసక్తి పెరిగింది.
ఈ టాస్క్‌లో షాలినీకి ‘విక్టిమ్ కార్డ్’ అనే ట్యాగ్ ఇవ్వడంపై శివ్ తన అభిప్రాయాన్ని వినిపించాడు. నీతూ విషయంలో షాలినీ అతిగా స్పందించిందని తనకు అనిపించిందని చెప్పాడు. సాధారణంగా జరిగిన టచ్‌ను పెద్ద దాడి జరిగినట్లుగా చూపించిందని విమర్శించాడు. రామకృష్ణ విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించిందని శివ్ అభిప్రాయపడ్డాడు. రామకృష్ణ పుష్ చేసినప్పటికీ, తనకు అనిపించినంత గట్టిగా అది లేదని పేర్కొన్నాడు. అయితే ఈ పరిణామాన్ని షాలినీ అతిగా తీసుకెళ్లడంతో చివరకు రామకృష్ణ విసిగిపోయి ఆమె కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించాడు. శివ్ చేసిన ఈ వ్యాఖ్యలతో షాలినీ స్పందించింది. నేను పట్టుకోమని చెప్పానా.? నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేశానా.? అలా చేసింది రామకృష్ణ అంటూ తన వాదనను వినిపించింది. దాంతో కాస్త వివాదం రేగింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు లభించిన ప్రత్యేక అవకాశాలు, ఓజీ సభ్యులపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హౌస్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా షాలినీకి ఇచ్చిన ‘విక్టిమ్ కార్డ్’ ట్యాగ్ చుట్టూ వివాదం మరింత ముదిరింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
