తాజావార్తలు

అక్టోబర్ 15 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్


దిన ఫలాలు (అక్టోబర్ 15, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో దూసుకుపోతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలందుతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు ఆశించిన లబ్ధి పొందుతారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతనం దిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కొందరు మిత్రులవల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమలు ఊపందుకుంటాయి.

ఇవి కూడా చదవండి



మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వ్యాపారాలు బాగా బిజీ అయ్యే సూచనలున్నాయి. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి.విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారా లను చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను మధ్యలోనే నిలిపేయాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. అధికారులు బాగా ఆదరిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రతి చిన్న పనికీ బాగా శ్రమపడాల్సి వస్తుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చదువుల్లో పిల్లల పురోగతి పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సాఫీగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరి ష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ జీవితం బాగా అనుకూలంగా మారుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు నిదానంగా పురోగమిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కాస్తంత మానసిక ఒత్తిడికి గురవుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా నిలకడగా ఉంటుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొం టారు. విద్యార్థులు చదువుల్లో శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ప్రయ త్నం సఫలమవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. మిత్రులతో కలిసి కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలక డగా సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి, వేధింపులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశిం చిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యమవుతుంటుంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను బాగా చక్కబెడతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *