సోషల్ మీడియా యుగంలో ఏ వార్త ఎప్పుడు వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా విదేశీయులు, భారతీయుల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్ల గురించిన వార్తలకు ఇంటర్నెట్లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇటీవల బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ (ఇన్స్టాగ్రామ్ ఐడీ: నమిత్ భయ్) అనే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి జూలీ అనే మహిళ భారత్‌కు వచ్చిందని, నవంబర్‌లో వీరిద్దరి వివాహం జరగనుందని వార్తలు విపరీతంగా హల్చల్ చేశాయి. అయితే, ఈ వైరల్ వార్తపై క్షేత్రస్థాయిలో పరిశోధన తరువాత అసలు నిజాన్ని బయటపడ్డాయి.
వైరల్ దావా ఏమిటి?
సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన కథనాల ప్రకారం.. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన యువకుడు రష్యా వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారి ఆమె అతడిని వెతుక్కుంటూ గ్రామానికి వచ్చిందని ప్రచారం చేశారు. ఆ విదేశీ మహిళ స్థానిక గ్రామంలో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
ఈ ప్రచారం కేవలం ఒక సృష్టి అని, పూర్తి అబద్ధమని తేలింది. అసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన శివియా ఛారిటీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం గ్రామీణ ప్రాంతాల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆ NGO టీమ్‌తో ఉన్న విదేశీ మహిళ పూర్ణియా ప్రాంత సందర్శనకు వచ్చినప్పుడు సదరు యువకుడు ఆమెతో కలిసి ఒక వీడియో తీశాడు.
యువకుడి స్పష్టత, పోలీసుల రంగ ప్రవేశం
ఈ విషయంపై వివాదం ముదరడం, తప్పుడు ప్రచారం జరగడంతో ఆ యువకుడు ఒక కొత్త వీడియోను విడుదల చేస్తూ స్పష్టత ఇచ్చాడు. నాకు ఆ విదేశీ మహిళతో ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాక్యం పూర్తిగా అబద్ధం. ఆ మహిళ కేవలం మా గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన ఒక అతిథి. ఆమెతో తీసిన వీడియోను నేను సరదాగా షేర్ చేస్తే, కొందరు తప్పుగా ప్రచారం చేశారు అని అతడు వెల్లడించాడు.
बिहार में कुछ भी संभव है
इस लड़के को आप लोग राहुल यादव नाम से जानते हैं घर भागलपुर फ़्रॉड निकला
इसका नाम नवनीत जो पूर्णिया का रहने वाला है Instagram id
नवनीत का कहना है जुली बिहार…. Read news https://t.co/iP9yUQraiF
— Prince Kumar🇮🇳 (@princek36296502) October 14, 2026
ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు వివరాలను సేకరించేందుకు స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఏది ఏమైనా, సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ సంచలన వార్త నిజం కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలను నమ్మకూడదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
