తాజావార్తలు

Gold Prices: మళ్లీ బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే భారీ మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే భారీ మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?


బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. గత వారంలో ధరలు భారీగా పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే డౌన్ అవుతూ వస్తోన్నాయి. సోమవారం ధరలు రూ.1500 మేర తగ్గగా.. మంగళవారం కూడా క్రాష్ అయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు తారుమారు అవుతున్నాయి. యుద్దం క్రమంలో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడంతో గోల్డ్ రేట్లు కుప్పకూలుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పడిపోగా.. ఇండియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,900గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.540 తగ్గాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,31,500గా ఉండగా.. నేడు రూ.500 పడిపోయింది.

-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,800గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,900 వద్ద కొనసాగుతోంది

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,950గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,050 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

-వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది

-హైదరాబాద్‌లో కేజి సిల్వర్ ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.40 లక్షలులగా ఉండగా.. మంగళవారం రూ.5 వేలు తగ్గుముఖం పట్టింది

-చెన్నైలో కిలో వెండి రేటు రూ.2.35 లక్షలుగా ఉండగా… సోమవారం రూ.2.40 లక్షల వద్ద కొనసాగింది

-బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *