నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది రష్మిక. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రష్మిక తన వర్క్, సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె మైసా చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఆమె తన కెరీర్ లోనే ఎప్పుడూ చేయని మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ కోసం రష్మిక చేసిన రిస్కీ స్టంట్స్ గురించి నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
మైసా చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోండ్ గిరిజన యువతిగా పవర్ ఫుల్ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా బ్యాంకాంక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఆమె చూపించిన ధైర్యం అందరిని విస్మయానికి గురి చేసింది. నిజానికి ఇలాంటి రిస్కీ స్టంట్స్ కోసం డూప్ లేదా బాడీ డబుల్ ఉపయోగిస్తుంటారు. కానీ రష్మిక మాత్రం సీన్ లో సహజత్వం కోసం ఎలాంటి డూప్ వినియోగించలేదు. రెండు రోజులపాటు ఏకంగా 20 గంటల సమాయాన్ని నీటిలోనే గడుపుతూ ఈ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో.. మహిళా ప్రధాన చిత్రంలో ఒక హీరోయిన్ ఎలాం
ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
అండర్ వాటర్ ఫైట్ సీన్ కోసం రష్మిక చూపిన ధైర్యానికి యాక్షన్ టీమ్ తోపాటు.. టెక్నికల్ క్రూ సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఎపిసోడ్ కేవలం ఫైట్ మాత్రమే కాకుండా స్క్రీన్ మీద విజువల్ ఫీస్ట్ లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరి రావు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..
రష్మిక మందన్నా..
ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..
