తాజావార్తలు

SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..

SBI: ఎస్బీఐ అకౌంట్ వాడుతున్నారా..? ఈ ఒక్క పొరపాటు చేస్తే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బ్యాలెన్స్ సున్నాకు కన్ఫామ్..


దేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి స్థానంలో ఉంది. దేశంలో ఎక్కువమంది ఖాతాదారులు ఉన్న బ్యాంకుగా కొనసాగుతోంది. ఎస్బీఐకు దాదాపు 52 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. అయితే తమ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డు ఉన్నా దీని గురించి తెలుసుకోవాల్సిందే. లేకపోతే మీరు సైబర్ మోసాల బారిన పడే అవకాశముంటుంది. ఎస్బీఐ కస్టమర్లను బురిడీ కొట్టించి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త పన్నాగం పన్నారు. ఎస్బీఐ పేరుతో ఒక నకిలీ సందేశాన్ని వైరల్ చేస్తున్నారు. రివార్డ్ పాయింట్ల పేరుతో ఫేక్ మెస్సేజ్‌ను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొట్టే మోసాలకు తెరలేపారు. ఖాతాదారులు చిన్న తప్పు చేసినా, నిర్లక్ష్యం ఉన్నా భారీగా నష్టపోయే అవకాశముంటుంది.

అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను అందిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఎస్బీఐ కూడా రివార్డ్ పాయింట్లను అందిస్తోంది. ఈ పాయింట్లను మొబైల్ రీఛార్జ్, ఆన్‌లైన్ షాపింగ్, ఇతర కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల మీకు ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ రివార్డ్ పాయింట్ల గడువు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అప్పటిలోగా ఉపయోగించుకోకపోతే ఆ తర్వాత పనిచేయవు. అయితే బ్యాంకింగ్ కస్టమర్లు ఈ రివార్డ్ పాయింట్లపై ఎక్కువ దృష్టి పెడుతుండటంతో.. మోసగాళ్లు దీనిని అవకాశంగా తీసుకుంటున్నారు. రివార్డ్ పాయింట్ల పేరుతో నకిలీ సందేశాలు పంపి రీడీమ్ చేసుకునేలా కస్టమర్లను ఆశపెడుతున్నారు. అనంతరం కొన్ని క్షణాల్లోనే వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

తాజాగా ఎస్బీఐ పేరుతో నకిలీ మెస్సేజ్‌లు వైరల్ అవుతుండగా.. దీనిపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. అటువంటి సందేశాలు పూర్తిగా నకిలీవని, వినియోగదారులు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఎస్బీఐ తన వినియోగదారులకు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఎటువంటి లింక్ లేదా ఏపికె ఫైల్‌ను పంపి దానిని డౌన్‌లోడ్ చేసుకోమని ఎప్పుడూ కోరదని పిఐబి స్పష్టం చేసింది. ఇలాంటి సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపి వాటి ద్వారా వినియోగదారుల బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తారని తెలిపింది. మీరు అలాంటి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే మీ మొబైల్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ కావచ్చు. ఈ మాల్‌వేర్ మీ వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతా సమాచారం, OTP, ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. దీని ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని నగదు కాజేస్తారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *