వెనుజులా ఉత్తర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 24 సాయంత్రం కేవలం ఒక నిమిషం వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో వరుసగా వచ్చిన భూకంపాల ధాటికి వెనుజులా కుదేలైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ భూ ప్రళయంలో మృతుల సంఖ్య 1,500 దాటింది. సుమారు 4 వేల మంది తీవ్రంగా గాయపడగా, మరో 50 వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూకంప తీవ్రతకు 774 భవనాలు కుప్పకూలగా, 189 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు కారణంగా వెనుజులాకు 6.7 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది ఆ దేశ మొత్తం జీడీపీ (GDP) లో 6 శాతానికి సమానం కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ సాయం – భారత్ అండ
ఈ క్లిష్ట సమయంలో వెనుజులాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చింది. భారత్, మెక్సికో, అమెరికా, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, టర్కీ, యూకే సహా పలు దేశాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భూకంప బాధిత దేశానికి మానవతా దృక్పథంతో తక్షణ సాయం అందించడంలో భారతదేశం ముందు వరుసలో నిలిచింది. ఇందులో భాగంగా భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ (Operation Amistad)ను ప్రారంభించింది.
భారత వాయుసేనకు చెందిన రెండు భారీ C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు సహాయక సామగ్రితో వెనుజులాకు తరలివెళ్లాయి. బాధితుల కోసం 35 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రి, మందులు మరియు వైద్య పరికరాలను భారత్ పంపింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు భారత సైన్యానికి చెందిన ఒక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు, అత్యాధునిక సాంకేతికత కలిగిన రెండు ‘భీష్మ్ క్యూబ్స్’ మొబైల్ హాస్పిటల్ యూనిట్లను భారత్ తరలించింది. “ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు అండగా నిలవడానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది” అని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. విపత్తు వేళ భారత్ అందించిన ఈ తక్షణ స్పందనపై అంతర్జాతీయంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Widespread flooding has damaged structures in Monsenor Jose Vicente de Unda, Venezuela, following heavy rainfall; the number of people affected is unclear. – factal news pic.twitter.com/4WhfBr5Dn2
— AZ Intel (@AZ_Intel_) June 28, 2026
🚨 URGENTE VENEZUELA 🇻🇪 : la zona de Chabasquén, estado de Portuguesa, bajo el agua.
Más de 8 horas de lluvia torrencial.
El río Chabasquencito se desbordó y arrasó calles y casas con lodo.
Venezuela sigue sufriendo.
¿Cuánto más? 🙏 pic.twitter.com/oQLzBoLoO3— Alerta Mundial (@TuiteroSismico) June 29, 2026
International News 🇻🇪
New tragedy in Venezuela: Heavy rains have severely affected several towns in Portuguesa State, with multiple landslides reported. pic.twitter.com/wqCYRWGyBj— Conflict Radar (@Conflict_Radar1) June 29, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
