Guru Vakri 2026: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్ఞానం, విద్య, సంపద, వివాహం, సంతానం, అదృష్టానికి గురువును కారకుడిగా భావిస్తారు. అందుకే గురు గ్రహం రాశి మార్పు, వక్రగమనం ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నమ్మకం. ఈ నేపథ్యంలో 2026లో గురు గ్రహ వక్ర సంచారం ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న గురు గ్రహం.. డిసెంబర్ 13, 2026న వక్రగమనంలోకి ప్రవేశించనుంది. అనంతరం 2027 జనవరి 25న తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. గురు గ్రహం ఈ విధంగా గమనాన్ని మార్చుకోవడం జ్యోతిష్య పరంగా ముఖ్యమైన పరిణామంగా పరిగణిస్తారు. ఈ మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మీనం, వృశ్చికం, కన్య, కర్కాటకం, వృషభ రాశుల వారికి ఈ కాలం కలిసి రావచ్చు.
