జస్ట్ 23 ఏళ్లకే కంపెనీ స్టార్ట్ చేసి.. ఏడాదిన్నరలోనే రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించి చరిత్ర సృష్టించాడు హైదరాబాద్ నగరానికి చెందిన గోపిశెట్టి సాయితేజ. వోక్సెన్ (Woxsen) యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా పొందాడు సాయితేజ. చదువు పూర్తయిన తర్వాత అందరిలా ఉద్యోగాల వేట కొనసాగించకుండా.. సరికొత్తగా ఆలోచించాడు. వ్యవసాయ రంగానికి తోడ్పడేలా ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు పదును పెట్టిన సాయితేజ, 2025లో ‘లూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అగ్రి కంపెనీని స్టార్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని ఆల్వాల్ కేంద్రంగా తన కంపెనీని రన్ చేస్తున్న సాయితేజ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలతో పాటు సుస్థిర వ్యవసాయ పరిష్కారాలను అందించగలిగాడు. దీంతో కంపెనీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే అతను తన వ్యాపారాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడు.
వికాస్ ఆల్విస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జూలై 17న ‘ఎక్స్’ (ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్‌లో.. సాయితేజ విజయం గురించి పేర్కొన్నాడు. విజయానికి వయసుతో సంబంధం లేదని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2025లో పబ్బ సంతోష్ అనే వ్యక్తితో కలిసి కంపెనీ స్టార్ట్ చేసిన సాయితేజ.. రైతులకు అండగా నిలుస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రూ. 20 కోట్లకు చేర్చాడు. కాగా, 2028 నాటికి కంపెనీ టర్నోవర్‌ను రూ. 100 కోట్లకు పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని సాయితేజ తెలిపాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. “ముందుకెళ్లే ధైర్యం, సరైన ప్రణాళిక, చేయగలమనే సత్తా ఉంటే.. విజయం తలవంచక తప్పదు” అని సాయితేజ నిరూపించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కంపెనీ స్టార్ట్ చేయడం ఒకెత్తయితే.. దాన్ని దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలబెట్టుకోవడమే వ్యాపార రంగంలో అసలైన సవాల్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. చిన్న వయసులోనే ఇంతటి విజయాన్ని అందుకున్న సాయితేజ, ఇప్పుడు స్టార్టప్‌లు పెట్టాలనుకునే ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Meet Saiteja Gopishetty from Telangana, a BBA graduate from Woxsen University Hyderabad.Now this guy at just 23 built a 20 crore company in just 1.5 years after graduation.
He is the founder of Luminara legacy https://t.co/ulsYEBWSeI. building an Agri seeds and chemicals… pic.twitter.com/LnkdHWPUrt
— Vikas Alwys (@VikasAlwys) July 17, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
