తాజావార్తలు

Pakistan: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్థాన్

Pakistan: ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్‌ అయిన పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు, ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత దారుణమైన స్థానానికి పడిపోయింది. ఆసియా దిగ్గజ జట్లలో ఒకరిగా పేరున్న పాకిస్థాన్, ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం వారి కంటే వెనుక కేవలం జింబాబ్వే జట్టు మాత్రమే ఉంది. జింబాబ్వే అసలు టెస్ట్ మ్యాచ్‌లు పెద్దగా ఆడకపోవడం, వరల్డ్ టెస్ట్…

Read More

Ishan Kishan: జర్ర బ్రేక్ ఇవ్వండి సామీ.. రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్

Ishan Kishan: టీమిండియా యంగ్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. చెన్నైలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు రెస్ట్ లేకుండా నేరుగా టీ20 సిరీస్‌కు రెడీ కావడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారు. దీనివల్ల వచ్చే రెండు రోజులు తాను మంచం మీద నుంచే కదలనని, కేవలం నిద్రపోతూ రికవరీపైనే దృష్టి పెడతానని ఇషాన్ సరదాగా, తీవ్ర అలసటతో…

Read More

అలాంటి హీరోను నేను ఎక్కడ చూడలేదు.. చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తాడు : సంపత్ రాజ్

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపత్ రాజ్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్న సంపత్ రాజ్.. మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర…

Read More

రూ.10 వేలలోపు 5జీ ఫోన్​ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే

బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి Lava మరో ఆసక్తికరమైన ఎంపికను సిద్ధం చేస్తోంది. Bold N4 Pro 5G పేరుతో రాబోతున్న ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విషయంలో ఆకట్టుకునే వివరాలను బయటపెట్టింది. ధర, ప్రాసెసర్ వంటి కీలక అంశాలు మాత్రం లాంచ్‌కు ముందు వెల్లడించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18న లాంచ్.. Lava Bold N4 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12…

Read More

ISROలో ఉద్యోగం పొందే ఛాన్స్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో తాత్కాలిక/పర్మినెంట్ ప్రాతిపదికన టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విభాగాల వారీగా…

Read More

మదీనాలో భారీ ఖనిజ నిక్షేపాలు.. యురేనియం, అరుదైన భూలోహాల ఆవిష్కరణ!

రియాద్: ప్రపంచానికి చమురు దిగ్గజంగా పేరున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు తన ఇంధన భవిష్యత్‌ను మరో దిశగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో కీలక ముందడుగు వేసింది. మదీనా ప్రాంతంలోని జబల్ సయీద్ ప్రాజెక్టులో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ ధాతువు ఉన్నట్లు అన్వేషణ, భూగర్భ అధ్యయనాల్లో గుర్తించినట్లు సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఈ ఖనిజంలో అరుదైన భూలోహాలు, ముఖ్యంగా హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అధిక సాంద్రతతో…

Read More

సూది గుచ్చకుండా.. చుక్క రక్తం తీయకుండా.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు

సూది గుచ్చాల్సిన పనిలేదు.. చుక్క రక్తం తీయాల్సిన అవసరం అంతకంటే లేదు..! కేవలం మీ ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షల నివేదికలు మీ చేతుల్లోకి వస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ అత్యధునిక AI సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఒకే ఒక్క నిమిషంలో హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో…

Read More

పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్‌ వినాయకుడు!

హిందూమతంలో పసుపుకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. పసుపును పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి పసుపు కొమ్ములతోనే వినాయకుడిని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇస్తున్నారు జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కు చెందిన స్థానికులు. వినాయక చవితి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపం, గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. పసుపు కొమ్ములు, మైదాపిండి, గోనె సంచులను ఉపయోగించి వినాయక విగ్రహాన్ని అద్భుతంగా…

Read More

మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్‌ అద్భుతం!

వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులు విభిన్న ఆకారాలు రూపాలలో గణపయ్య పై వారి భక్తిని చాటుకుంటున్నారు.. ఒకరిని మించి మరొకరు ఎత్తైన భారీ విగ్రహాలు అబ్బురపరిచే ఆకారాలతో భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. వరంగల్ కు చెందిన ఓ భక్తుడు అతి సూక్ష్మ పరిమాణంలో గణపతిని ఆకుపై తయారు చేశాడు.. అదే ఆకుపై గణపతి విగ్రహం చుట్టూ ఉండ్రాలు సమర్పించాడు.. వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ వినూత్న రీతిలో గణపతిపై…

Read More

లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య! వినాయకుడు స్పెషల్‌ అట్రాక్షన్‌

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ 34వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష గోల్డ్ ఇమిటేడ్ లక్ష్మీ కాసులతో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసారు… 12 అడుగుల శ్రీలక్ష్మీ కాసుల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు… చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు లక్ష్మీకాసుల వినాయకుణ్ణి దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. గోల్డ్ ఇమిటేషన్ లక్ష్మీకాసులతో తయారుచేసిన వినాయక విగ్రహాలు వినాయక చవితి నాడు అక్కడక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది… ఈ…

Read More