తాజావార్తలు

Andhra Pradesh: చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

విశాఖపట్నం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద బుధవారం తెల్లవారుజామున వింత ఘటన కలకలం రేపింది. పార్క్ మెయిన్ గేటు ఎదుట ఉన్న ఓ చెట్టు కింద భారీగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా దర్శనమివ్వడంతో స్థానికులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఒకేచోట వేర్వేరు రకాల నోట్ల ముక్కలు పడి ఉండటంతో ఎవరో కావాలనే ఇలా పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కోణం దాగి ఉందా అన్న అనుమానాలు…

Read More

దొంగతనానికి వెళ్లి.. బొక్కబోర్లా పడ్డాడు! గ్రిల్స్‌లో ఇరుక్కుని నానా తంటాలు!

సూరత్: చోరీ చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుకవైపు ఉన్న గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నానా తంటాలు పడుతుండగా స్థానికులు అతడిని గమనించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. సూరత్‌లోని రాజారాంనగర్ సొసైటీలో ఓ NRIకి చెందిన ఇంట్లోకి ఓ వ్యక్తి చోరీ కోసం ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం అతడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు….

Read More

తండ్రి.. కొడుకు.. బావమరిది.. ముగ్గురినీ మింగేసిన జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ!

నంద్యాల జిల్లా: జీఎన్‌ఎస్‌ఎస్ కాలువలో ప్రమాదవశాత్తూ పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతైన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అవుకు మండలం రామాపురం వద్ద ఉన్న జీఎన్‌ఎస్‌ఎస్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామాపురం జీఎన్‌ఎస్‌ఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముగ్గురు కాలువలో పడిపోయారు. ప్రమాదంలో అప్రోజ్‌ (30), అతని కుమారుడు ఆరిష్‌…

Read More

అడిడాస్‌లో భారీ ఉద్యోగ కోతలు.. గురుగ్రామ్ టెక్ హబ్‌లో 50 శాతం మందికి షాక్!

న్యూఢిల్లీ: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ అడిడాస్‌ (Adidas) భారత టెక్నాలజీ విభాగంలో ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్‌లోని ఇండియా టెక్ హబ్‌లో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారనే ఖచ్చితమైన సంఖ్యను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. గురుగ్రామ్ టెక్ హబ్‌లో సుమారు 700 మంది పనిచేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. వీరిలో సుమారు 300 నుంచి 350 మంది లేదా అంతకంటే ఎక్కువ…

Read More

Dream Meaning: ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!

Aspicious Deams Telugu: ప్న ప్రపంచం ఎన్నో రహస్యాలు, సంకేతాలతో నిండి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో కష్టాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో కనిపించే కొన్ని కలలు.. రాబోయే మార్పులకు సంకేతాలుగా భావిస్తారు. స్వప్న శాస్త్ర విశ్వాసాల ప్రకారం, కొన్ని రకాల కలలు భవిష్యత్తులో ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యం వంటి సానుకూల పరిణామాలను సూచిస్తాయని చెబుతారు. అలాంటి ఏడు కలలు ఏంటో…

Read More

అదిరిపోయే ఫీచర్లతో మహిళల కోసం స్మార్ట్‌వాచ్​ తెచ్చేసిన నోయిస్.. జ్యువెలరీ లుక్‌తో తక్కువ ధరకే

చేతికి పెట్టుకున్నప్పుడు సాధారణ గడియారంలా కాకుండా ఆభరణంలా కనిపించే స్మార్ట్‌వాచ్ కావాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక. ఆకర్షణీయమైన రూపంతో పాటు ఆరోగ్యాన్ని గమనించే సదుపాయాలు, కాల్స్ మాట్లాడే అవకాశం, సందేశాల సమాచారం వంటి ఉపయోగకరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ధరకు తగ్గట్టు ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆభరణాన్ని తలపించే రూపం.. ఈ వాచ్‌లో మొదట ఆకట్టుకునేది దాని రూపకల్పనే. సాధారణంగా కనిపించే చతురస్రం లేదా గుండ్రని ఆకారానికి భిన్నంగా, ఆభరణాన్ని తలపించే విధంగా దీనిని…

Read More

కన్న కొడుకి కర్కశం.. వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసిన కొడుకు..!

కరీంనగర్: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుమారుడితోనే ఆస్తి వివాదం తలెత్తడంతో ఓ వృద్ధ దంపతులు ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ‘‘ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి.. మా పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయండి’’ అంటూ వారు అధికారులను వేడుకున్నారు. కోతిరాంపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవులపల్లి లక్ష్మణ్‌ 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు కుమారుడు…

Read More

Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..! మీ బర్త్ డే ఇందులో ఉందా..?

సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ లక్షణాల గురించి జన్మతేదీ ఆధారంగా కొన్ని విషయాలను అంచనా వేయవచ్చని న్యూమరాలజీ చెబుతుంది. ఈ క్రమంలో ఏదైనా నెలలో 3, 12, 21 లేదా 30 తేదీల్లో జన్మించిన వారిని మూలాంకం 3కు చెందినవారిగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంకం 3కి అధిపతిగా బృహస్పతి (గురు) గ్రహాన్ని పరిగణిస్తారు. అందువల్ల ఈ తేదీల్లో జన్మించినవారిలో సింప్లిసిటీ, నిజాయితీ, జ్ఞానంపై ఆసక్తి…

Read More

జిరామ్ వ్యాలీ మారణకాండ.. 13 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. 10 మందికి ఉరిశిక్ష!

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 29 మంది మరణించిన 2013 ఝిరమ్ వ్యాలీ నక్సలైట్ దాడి కేసులో నిందితులందరికీ మరణశిక్ష విధించింది. ఈ నెల ప్రారంభంలోనే, కోర్టు 10 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి, సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించింది. జగదల్‌పూర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ ఈ కేసులో దోషి అని తీర్పు ఇచ్చారు. ఇద్దరు మహిళలతో సహా…

Read More

500 మందికి పులిహోర చేయాలా? గణపతి భోజనాల్లో ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

ముందుగా, 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని, చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కేవలం మునిగితే సరిపోతుంది. ఇలా కడిగిన చింతపండును ఒక గంట సేపు నానబెట్టాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్లు వాడవచ్చు. ఆ తర్వాత, గిన్నెను స్టవ్‌పై పెట్టి, ఐదారు నిమిషాలు వేడి చేయాలి. ఉడకడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారాక,…

Read More