ఈ చిన్న పని చేస్తే చామంతి మొక్కకు గుత్తులు గుత్తులుగా పువ్వులు. ఎవ్వరూ చెప్పని ట్రిక్స్ ఇవే..
ఇంటి బాల్కనీలు, పెరట్లను రంగురంగుల పూల మొక్కలతో అలంకరించుకోవడం నేటి రోజుల్లో చాలామందికి ఒక అద్భుత అలవాటుగా మారింది. గులాబీ, మందార, బంతి వంటి పూలతో పాటు.. చలికాలం వస్తుందంటే అందరి దృష్టి చామంతి మొక్కలపైనే పడుతుంది. చలిగాలుల్లో రకరకాల రంగుల్లో విరబూసే చామంతి పువ్వులు ఇంటికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే ‘‘మేము చామంతి మొక్కలు నాటినా అవి సరిగ్గా ఎదగడం లేదు.. ఆశించిన స్థాయిలో పూలు పూయడం లేదు.. మొక్క బక్కచిక్కినట్లు పొడవుగా పెరుగుతోంది’’…
