Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?
హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తరహా మోసాల్లో ఒకటిగా పోలీసులు తెలిపారు. నిందితులు ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధుడిని బెదిరించారు….
