ఇంట్లో దోమల బెడదతో విసుగు చెందారా? 4 కుండీల్లో ఈ గడ్డిని పెంచారంటే ఈజీగా చెక్ పెట్టొచ్చు..!
ఇంట్లో దోమల బెడదను తగ్గించడానికి రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్లకు బదులుగా ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం. వాటిలో లెమన్ గ్రాస్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్లో ఉండే తీవ్రమైన సువాసన దోమలను ఇంట్లోకి రాకుండా తరిమికొడుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నివారించడానికి ఇదొక సురక్షితమైన మార్గం. లెమన్ గ్రాస్ దోమలను ఎలా నివారిస్తుంది? లేమన్ గ్రాస్లో సిట్రోనెల్లా అనే సహజమైన నూనె సమ్మేళనం ఉంటుంది. దీని నుండి…
