వంట విషయంలో అత్తా-కోడలు ఘర్షణ.. తెల్లారేసరికల్లా 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య!
కర్ణాటకలో 35 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని సోలదేవనహళ్లి పోలీస్ లైన్స్ సమీపంలోని అబ్బిగెరెలో బుధవారం (మార్చి 04) తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలిని సుష్మ (35) గా గుర్తించారు. ఆమె గతంలో…
