తాజావార్తలు

Nuclear Race: జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు!

భూమిపైనే కాదు.. చంద్రుడిపై కూడా తమ అధిపత్యాన్ని చలాయించాలనే లక్ష్యంతో.. అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా, రష్యా, చైనా పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాలని మూడు దేశాలు చూస్తాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎలాంటి మెయింటేనెన్స్ లేకుండా అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకుని, చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిరంతరం పనిచేసేలా ఓ అణు రియాక్టర్‌ను రూపొందించాలని గత ఆగస్టులో నాసా సంబంధిత కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ…

Read More

Tollywood : కమెడియన్‏గా, విలన్‏గా రఫ్పాడించిన నటుడు.. ఇండస్ట్రీలోనే తిరుగులేని యాక్టర్.. ఆ ఒక్క విషయాన్ని పట్టించుకుని ఉంటే..

తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకున్నప్పుడు హీరోలు, హీరోయిన్లు, దర్శకులతో పాటు ఆ కాలాన్ని నవ్వులతో నింపిన హాస్యనటులను తలుచుకోవడం అనివార్యం. రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజాలలో రమణారెడ్డి ప్రత్యేకత వేరు. తన బాడీ లాంగ్వేజ్‌ను ఆయుధంగా మలచుకున్న ఆయన, యాస, డైలాగ్ చెప్పే పద్ధతి, కళ్ళతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన పాత్రకు పూర్తిగా కట్టుబడి, కామెడీని అందులోనే వెతికేవారు. డైలాగ్ చెప్పకుండానే ముఖంలో కనిపించే భయం, అనుమానం, ఆశ్చర్యం, అమాయకత్వం…

Read More

నాలుగు భాషలలో సంచలనం.. శోభన్ బాబును స్టార్‏గా నిలబెట్టిన సినిమా.. ప్రేక్షకుల గుండెను బలంగా తాకిన మూవీ..

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కాలాతీతమైనవి. అవి కేవలం తెరపై కథ చెప్పడమే కాదు, సమాజాన్ని ప్రశ్నిస్తాయి. అలాంటి అపురూప చిత్రాల్లో ఒకటి “మనుషులు మారాలి”. 1969 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రం, తన పేరులోనే “మనుషులు ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? మారాల్సింది మనుషులా? సమాజమా?” వంటి లోతైన ప్రశ్నలను సంధించింది. ఆ కాలంలో తెలుగు సినిమా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, పేదరికం,…

Read More

IND Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త జట్టు.. ఏకంగా 13 మార్పులతో టీమిండియా ప్రకటన

IND Vs WI: భారత క్రికెట్ జట్టు తాజాగా ముగిసిన వన్డే సిరీస్ విజయానందం తర్వాత, వెస్టిండీస్‌తో తలపడే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ పొట్టి ఫార్మాట్ పోరు కోసం సెలక్టర్లు జట్టులో అనూహ్యమైన మార్పులు చేశారు. వన్డే జట్టులో ఆడిన చాలా మంది సీనియర్లను పక్కనపెట్టి, యువ రక్తానికి పెద్దపీట వేశారు. ఏకంగా 13 మార్పులతో కొత్త జట్టును మైదానంలోకి దింపుతున్నారు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20…

Read More

Weather Report: నైరుతి రుతుపవనాల తిరుగోమనం.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి రుపతవనాల తిరోగమనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత మే నెలలో కేళలోని కొచ్చి తీరాన్ని తానిక నైరుతి రుతుపవనాలు, జూన్ ఫస్ట్ వీక్‌లో తెలంగాణ, జులై ఫస్ట్ నాటికి తెలంగాణ మొత్తం వ్యాప్తించాయి. ఇక ఇలా వచ్చిన రుతువణాలు నవంబర్‌లో తిరుగు ప్రయాణం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణను…

Read More

దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్‌ అవుతున్న ప్రత్యేక వంటకం

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల ఫుడ్ ప్రయోగాలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా భాగ్యనగరంలో ఓ వినూత్న వంటకం ఫుడ్ లవర్స్ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ అందిస్తున్న ‘దాల్ విస్కీ’ అనే ఫ్యూజన్ డిష్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర భారతదేశానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ వంటకం ‘దాల్ మఖనీ’కి ఆల్కహాల్ ఫ్లేవర్ జోడించి ఈ ప్రత్యేక డిష్‌ను తయారు చేస్తున్నారు. అయితే దీనిని తయారుచేసే విధానమే…

Read More

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై గనక ప్రత్యక్షంగా దాడులు జరిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో దేశాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. మాస్కోలో జరిగిన వాల్డాయ్ ఫోరమ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అందుబాటులో ఉన్న అన్ని రకాల విధ్వంసక ఆయుధాలను తక్షణమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. పోలండ్, లిథువేనియా దేశాల మధ్య ఉన్న కలినిన్‌గ్రాడ్ ప్రాంతం రష్యాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ఒకవేళ…

Read More

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఇది మనం రోజూ వినే పాఠమే.. అయినా ఎవరూ లెక్కచేయరు..కానీ ఒకే ఒక్క సిగరెట్‌.. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసేసింది. ఆ..ఏముంది.. సిగరెట్‌ కాల్చడంవల్ల క్యాన్సర్‌ వచ్చి పోయుంటాడులే అనుకుంటున్నారా.. కానే కాదు. ఎవరూ ఊహించని విధంగా ఒక సిగరెట్ ఆ వ్యక్తిని సజీవం దహనం చేసింది. సిగరెట్‌ కాల్చడం ఎంత హానికరమో.. కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం కూడా అంతకంటే ప్రమాదమని ఈ ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళ్దాం.. మద్యం, సిగరెట్,…

Read More

3D టెక్నాలజీతో పేదల ఇళ్లు.. ఏపీలో 3 లక్షల గృహాలకు శంకుస్థాపన!

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భూమిపూజ చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి పెమ్మసాని పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణ నిర్మాణ రంగంలోకి తీసుకొస్తున్న అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ….

Read More

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలో తన చుట్టూ ఉన్న వలయాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శనిగ్రహం, అక్టోబరు 4, ఆదివారం అంటే ఈరోజే భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. దీంతో ఈ రోజు రాత్రంతా ప్రకాశవంతంగా మెరుస్తూ ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. ప్రతి ఏడాది ఒకసారి జరిగే ఈ అరుదైన సన్నివేశాన్ని ‘ప్రతియోగం’ అని పిలుస్తారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, శనిగ్రహం ఒకే సరళరేఖపైకి వస్తాయి. ప్లానిటరీ సొసైటీ ఆఫ్…

Read More