పాకిస్థాన్ మీదుగా ఇరాన్కు చైనా క్షిపణులు..? ఘాటుగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్!
అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, చైనాలో తయారైన భుజంపై మోసుకెళ్లే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు (MANPADS)ను ఇరాన్ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి విడతలో సుమారు 400 క్షిపణి లాంచర్లు పాకిస్థాన్ మార్గం ద్వారా ఇరాన్కు చేరనున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్…
