Actor Suresh: ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్
సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను”…
