Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్! చరిత్ర గర్వపడే నిజగాథ
ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో…
