శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం
ఈ క్రమంలో హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన భక్తుడు శివశంకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాగభరణాన్ని ఆలయానికి బహూకరించారు. సుమారు 540 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నాగ భరణం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐదు శిరస్సులతో అత్యంత సుందరంగా, కళాత్మకంగా రూపొందించిన ఈ నాగభరణం కాంతివంతంగా మెరిసిపోతూ దర్శనార్థులను ఆకర్షిస్తోంది. వెండితో చేసినప్పటికీ దీనిపై చేసిన శిల్పకళ, రూపకల్పన ఎంతో ప్రత్యేకంగా…
