తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం.. ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి, సెగ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు ప్రస్తుతం ఒక వింతైన, భయంకరమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆకాశం నుండి అగ్నిగోళంలా సూర్యుడు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అగ్ని తాపానికి అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగిస్తుందని అనుకుంటే, అది అకాల వర్షమై రైతన్నల కన్నీటికి కారణమవుతోంది. అసలు మే నెలలో ఈ…
