తాజావార్తలు

గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!

గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!


ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపే, అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్ జిల్లాలో కేవలం తొమ్మిది నెలల వయసున్న కన్నపేగు ముక్కపై, 14 ఏళ్ల మైనర్ బాలుడు మృగంలా ప్రవర్తించాడు. తన స్వంత మేనకోడలిని అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టాడు బాలుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (జూన్ 20) తెల్లవారుజామున ఆ అమాయక పసికందు తన తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఉదయం నిద్రలేచిన తల్లికి పక్కన పాప కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన గ్రామం మొత్తం జల్లెడ పట్టారు. గంటల తరబడి వెతికిన తర్వాత, ఇంటికి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక పొలంలోని రేకుల షెడ్డులో ఆ పాప స్పృహ కోల్పోయి, తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం చూసి అందరూ నివ్వెరపోయారు. ఒంటిపై తీవ్ర గాయాలతో ఉన్న ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.

ఈ ఘాతుకానికి ఒడిగట్టింది మరెవరో కాదు, ఇటీవల కాలంలోనే గ్రామానికి తిరిగి వచ్చిన ఆ బాలికకు దూరపు వరసయ్యే మేనమామ అని గోరఖ్‌పూర్ ఏఎస్పీ పాటిల్ నిమిష్ దశరథ్ వెల్లడించారు. దారుణం చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఉండేందుకు, ఆ నిందితుడు ఏమీ తెలియనట్లు బాధితురాలి కుటుంబంతో కలిసి పాప కోసం వెతుకుతున్నట్లు నాటకమాడాడు. అయితే, కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా సదరు మైనర్ బాలుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో పోలీసులు విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. ఘటన సమయంలో తాను తీవ్రంగా మద్యం మత్తులో ఉన్నానని, ఆ మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టానని నిందితుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి సంఘటనా స్థలం నుండి కీలక సాక్ష్యాలు సేకరించారు. నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి, అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *