ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. తాజాగా.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ఆసియా క్రీడల్లో మహిళల 75 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో బాక్సింగ్ స్వర్ణం గెలుచుకుని, లవ్లీనా బోర్గోహైన్ తన 29వ పుట్టినరోజున తనకు తానే ఒక చక్కటి బహుమతిని ఇచ్చుకుంది. శుక్రవారం నిషియో జిమ్నాసియంలో జరిగిన మహిళల 75 కేజీల విభాగం ఫైనల్ పోరులో చైనాకు చెందిన జియి బావోను ఓడించిన భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. తన తొలి ఆసియా క్రీడల స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.. తద్వారా, దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్ తర్వాత ఆసియాడ్ స్వర్ణం గెలిచిన రెండవ భారత మహిళగా నిలిచింది. ఈ విజయంతో, 2014లో మేరీ కోమ్ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.
అంతకుముందు కజకిస్తాన్‌కు చెందిన నటాల్యా బోగ్దానోవాను ఓడించి ఫైనల్‌కు ప్రవేశించిన లోవ్లినా, హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో తాను సాధించిన రజత పతకాన్ని అధిగమించి, ఈ ఖండాంతర ఈవెంట్లో చివరకు స్వర్ణాన్ని దక్కించుకుంది.
28 ఏళ్ల లవ్లీనా బోర్గోహైన్.. ఇప్పటికే ఒలింపిక్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకోగా, నగోయాలో సాధించిన స్వర్ణం ఆమె కెరీర్‌కు మరో ముఖ్యమైన అధ్యాయాన్ని జోడిస్తుంది.
