తాజావార్తలు

బాత్రూంలో వింత శబ్దాలు.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. చూడగానే గుండె హడల్..


పుట్టలు, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ గోపాలపట్నంలో.. విషపూరితమైన నాగు పాము తీవ్ర కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్‌ దగ్గర నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు.. వివరాల ప్రకారం.. విశాఖ గోపాలపట్నం ప్రాంతం ..! ఓ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇల్లంత వెతికితే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక వాష్ రూమ్ తలుపు దగ్గరకు వెళ్లేసరికి ఆ శబ్దాలు మరింత పెద్దగా వినిపిస్తున్నాయి. దీంతో నెమ్మదిగా వాష్ రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగేంత పని అయింది. దీంతో పరుగులు తీశారు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు.. వాళ్లు చూసినది ఏంటో తెలుసా..? భారీ నాగుపాము..

సుమారు ఆరడుగుల పొడవున్న ఈ నాగుపాము కనిపించిన వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్ కు అందించారు. పెందుర్తికి చెందిన సునీల్ స్నేక్ క్యాచర్ బృందం.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును బంధించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ పాము పడగవిప్పి బుసలు కొట్టింది. చాకచక్యంగా వ్యవహరించిన సునీల్ బృందం.. నాగుపామును రెస్క్యూ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సునీల్ బృందాన్ని అభినందించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *