తాజావార్తలు

అక్కడ కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే..: గావస్కర్ సంచలన వ్యాఖ్యలు


Sunil Gavaskar Australia Bangladesh Test Pitch Controversy: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మాకే వేదికగా జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా స్వల్ప వ్యవధిలోనే ముగిసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 100 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లకు కూడా పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభంగా సాగలేదు. కామెరాన్ గ్రీన్ చేసిన 67 పరుగులే ఆ జట్టు బ్యాటర్లలో అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అతి తక్కువ వ్యవధిలో ముగిసిన మ్యాచ్గా నిలిచింది. ఈ పరిణామంపైనే గావస్కర్ తన కాలమ్‌లో పిచ్‌లపై జరుగుతున్న విశ్లేషణల్లో ఉన్న తేడాలను ప్రశ్నించారు.

‘భారత్‌లో జరిగితే విమర్శలు వచ్చేవి’..

ఆస్ట్రేలియాలో ఇలాంటి స్వల్ప వ్యవధి టెస్టులు గత కొన్నేళ్లలో నాలుగుసార్లు జరిగాయని గావస్కర్ ప్రస్తావించారు. అలాంటి ఫలితాలు రావడానికి కారణమైన వేగవంతమైన, అధిక బౌన్స్ ఇచ్చే పిచ్‌లపై మాత్రం తగిన స్థాయిలో విమర్శలు కనిపించడం లేదని అన్నారు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

ఇవి కూడా చదవండి



పిచ్‌లో ఎక్కువ గడ్డి ఉంచడానికి వాతావరణ పరిస్థితులను కారణంగా చూపొచ్చని, లేదంటే బ్యాటర్లకు బౌన్స్‌ను ఎదుర్కొనే సాంకేతికత లేదని చెప్పొచ్చని గావస్కర్ వ్యాఖ్యానించారు. కానీ స్వదేశీ బ్యాటర్లు కూడా పెద్ద భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోతే పిచ్ ప్రభావాన్ని కూడా ప్రశ్నించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

మాకే పిచ్‌పై గావస్కర్ ‘హిపోక్రసీ’ వ్యాఖ్యలు..

మొదటి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిన తర్వాత మాకేలో వేగం, బౌన్స్‌కు అనుకూలమైన పిచ్ రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని గావస్కర్ అన్నారు. పిచ్ తయారీలో జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి సూచనలు లేవని చెప్పడం కూడా సాధారణమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

పిచ్‌కు మ్యాచ్ రిఫరీ ఇచ్చే రేటింగ్‌పైనా గావస్కర్ ప్రశ్నలు లేవనెత్తారు. భారత్‌లో మూడు రోజుల్లో టెస్టు ముగిసినా పిచ్‌లు, బీసీసీఐ, భారత క్రికెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతాయని, అదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కనిపించినప్పుడు విశ్లేషణ భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ తీరును ‘హిపోక్రసీ’గా అభివర్ణించారు.

మాకే టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం నేపథ్యంలో పిచ్‌ల ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. గావస్కర్ వ్యాఖ్యలు ఈ చర్చను మరింత పదును పెట్టాయి. ముఖ్యంగా స్వదేశీ జట్లు ఆడే పిచ్‌లను అంచనా వేసే విధానంలో అందరికీ ఒకే ప్రమాణం ఉండాలన్న ప్రశ్నను ఆయన ముందుకు తెచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *