తాజావార్తలు

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా


ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో ఆరు రహస్యమైన గోళాకార వస్తువులు కొట్టుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టౌన్స్‌విల్లేకు ఉత్తరాన ఉన్న ఫారెస్ట్ బీచ్ తీరంలో కనిపించిన ఈ వింత లోహపు గోళాలు అంతరిక్ష శిథిలాలై ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో ప్రమాదకర రసాయనాలు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్వీన్స్‌లాండ్ అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక రక్షణ సూట్లు ధరించి, ఇప్పటివరకు దొరికిన గోళాలను అత్యంత జాగ్రత్తగా రసాయన నిరోధక కంటైనర్లలోకి తరలించారు. ఈ వస్తువులపై ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ముమ్మర దర్యాప్తు ప్రారంభించింది. ఇవి అంతరిక్ష నౌకలకు చెందిన ఇంధన ట్యాంకులు కావచ్చంటూ ఆన్‌లైన్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. స్పేస్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలైస్ గోర్మాన్ దీనిపై స్పందించారు. ఇవి రాకెట్ ఇంధన వ్యవస్థలో భాగమైన టైటానియం మిశ్రమలోహంతో చేసిన పీడన పాత్రలని, వీటిని ‘స్పేస్ బాల్స్’ అంటారని తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా అంతరిక్షం నుంచి వాతావరణంలోకి వచ్చే శిథిలాలపై ఉండే కాలిన గుర్తులు వీటిపై లేవు. కాబట్టి ఇవి రాకెట్ మొదటి లేదా రెండవ దశలోనే విడిపోయి సముద్రంలో పడి ఉండవచ్చు. ఇటీవల భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన ఒక విదేశీ రాకెట్‌కు చెందిన శిథిలాలతో ఈ వస్తువుల లక్షణాలు సరిపోలుతున్నట్లు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాథమికంగా నిర్ధారించింది. రానున్న రోజుల్లో మరిన్ని శిథిలాలు వచ్చే అవకాశం ఉన్నందున, అనుమానాస్పద వస్తువుల చెంతకు వెళ్లవద్దని తీరప్రాంత ప్రజలను అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!

కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!

చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *