అది తన సన్నివేశం అయినా, కమెడియన్ సన్నివేశం అయినా, లేదా కాంబినేషన్ సన్నివేశం అయినా, మహేష్ మానిటర్ ముందు కూర్చుని, ఎటువంటి జోక్యం చేసుకోకుండా, ఇతర నటులను వారి పని చేయనిచ్చేవారని త్రిష అన్నారు. మహేష్ బాబు పని పట్ల ఉన్న అంకితభావం, నిబద్ధత సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శప్రాయమని త్రిష అన్నారు. మహేష్ బాబు షూటింగ్ సమయంలో ఎప్పుడూ తన వానిటీ వ్యాన్‌కు వెళ్లరని, అది తన సీన్ అయినా, ఇతరుల సీన్ అయినా మానిటర్ ముందే కూర్చుని గమనిస్తుంటారని త్రిష చెప్పుకొచ్చారు.
