Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూ ధరలకు కాస్త బ్రేకులు పడి తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కిలో వెండి ధర రూ.4 లక్షల వరకు వెళ్లగా, తర్వాత క్రమంగా దిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే దాదాపు లక్ష రూపాయలకుపైగానే తగ్గుముఖం పట్టింది. తాజాగా ఏప్రిల్ 21వ తేదీన ఏకంగా కిలో వెండిపై 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ఉదయం కిలో వెండి ధర రూ.2,75,000 వరకు ఉండగా, అదే ఉదయం 11 గంటల సమయానికి రూ.10 వేలు తగ్గి ప్రస్తుతం కిలో సిల్వర్ ధర రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: DMart ఏప్రిల్ 4వ వారం మెగా ఆఫర్లు.. 80% వరకు డిస్కౌంట్.. బై వన్ గెట్ వన్ ఫ్రీ డీల్స్‌తో కస్టమర్లకు పండుగ!
హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,75,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్రస్తుతం ఈ సమయానికి బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న తులం బంగారంపై 490 రూపాయల వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,290 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,16,470 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
