గ్రామాల్లో సిమెంట్ రోడ్లు.. హైవేలపై తారు రోడ్లు ఎందుకు..? ఏది బెస్ట్? తేడా ఏంటి?
మనం రోజూ ప్రయాణించే రోడ్లలో కొన్ని నల్లగా కనిపిస్తాయి. మరికొన్ని తెల్లటి రంగులో ఉంటాయి. చాలామంది వీటిని తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు అని పిలుస్తారు. అయితే సిమెంట్ రోడ్డు అంటే నిజానికి కాంక్రీట్ రోడ్డు. కాంక్రీట్‌లో సిమెంట్‌తో పాటు ఇసుక, కంకర, నీరు కలిపి నిర్మిస్తారు. ఈ రెండు రకాల రోడ్లకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయి. తారు రోడ్డు తారు లేదా బిటుమిన్‌ను కంకరతో కలిపి ఈ రోడ్లను నిర్మిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు,…
