ఇదో కొత్త తరహా దోపిడీ.. దీక్షధారులుగా వచ్చి మహిళలను మత్తులోకి దించి దారుణం..!
వరంగల్ నగరంలో కొత్త తరహా దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్వామి దీక్షలో ఉన్నట్లు నటిస్తూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దుండగులు మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. పట్టీలకు మెరుగు పెడతామని నమ్మించి, మత్తు మందు ఇచ్చి మహిళల ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలను అపహరిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని కరీమాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్‌కు చెందిన నీలం రత్నావతి (36), ఇంటర్ విద్యార్థిని…
