కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడికి విచిత్ర మొక్కలు.. కోరిక తీరాలంటే ఏం చేస్తారో తెలుసా..?
దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. కొబ్బరికాయలు ముడుపు కట్టడం, బంగారం వెండి కానుకలు సమర్పించడం చూస్తుంటాం.. సమ్మక్క-సారక్క దేవతలకైతే బెల్లం మహా నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం రాచగుమ్మడికాయలే మహా నైవేద్యం.. కోటీశ్వరులైనా.. కటిక పేద భక్తులైనా, ఎంతటివారైనా సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే..! కొత్తకొండ వీరభద్రస్వామి కి మొక్కులు మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయ…
