సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్ టేబుల్ ఇదే!
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించింది. 08517 విశాఖపట్నం టు చర్లపల్లి ఆదివారం (18.01.2026) మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది. 08518 చర్లపల్లి టు విశాఖపట్నం సోమవారం (19.01.2026) ఉదయం…
