సెంచరీతో చెలరేగిన పడిక్కల్..! కానీ టీమిండియాలో బయటపడ్డ లోపాలు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో కొలంబోలో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతోంది. ఒకవైపు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు బంతుల్లోనే డకౌటై నిరాశపరిచితే.. మరోవైపు యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన శతకంతో భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కీలక సమయంలో క్రీజులో నిలిచిన పడిక్కల్ 14 ఫోర్లతో 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటాడు. మ్యాచ్ రెండో రోజు శ్రీలంక క్రికెట్ ఎలెవన్ 363/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను…
