Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలు కనకలక్ష్మి షూ వేసుకురాలేదన్న కారణంతో పలువురు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేశారు. ఈ అమానుష చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్ తనను తాను సమర్థించుకుంటూ, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో పది నిమిషాల పాటు మాత్రమే చెప్పుల దండతో నిలబెట్టానని వివరణ ఇచ్చారు. ఈ…
