40 ఏళ్లనాటి పగ.. మద్యం సెట్టింగ్ వేసి.. ధావత్కు పిలిస్తే వెళ్లిన బీఆర్ఎస్ నేత.. ఇంతలో దారుణం..!
సూర్యాపేట జిల్లాలోని యల్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త, చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం (మే 22) సూర్యాపేటలోని తన నివాసం నుండి బయటకు వెళ్లిన మధు, సాయంత్రం నుండి ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యల్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో అనుమానాస్పదంగా మూట కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మధు మృతదేహంగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం…
