Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమల్లోకి.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఆర్ధిక అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారిలో ఎక్కువ శాతం మంది వాడుతుండగా.. ఇక సామాన్య వ్యక్తులు కూడా విరివిగా వినియోగిస్తున్నారు. గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు పలు బెనిఫిట్స్‌ను తగ్గిస్తున్నాయి. ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ సౌకర్యం, రివార్డ్ పాయింట్లలో కొత, డిస్కౌంట్స్ తొలగింపు…
