Hyderabad: ఘోర ప్రమాదం: చెత్తకు పెట్టిన నిప్పు.. మూడు కార్లు బుగ్గిపాలు!
హైదరాబాద్ మహానగరం శివారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని ఒక ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న మూడు కార్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టారు. అయితే ఆ మంటలు కాస్తా పక్కనే పార్క్ చేసి ఉన్న కార్లకు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు…
